నిర్ధేశిత ధరలకే విత్తనాలు అమ్మాలి


Ens Balu
4
Kathipudi
2022-07-15 12:32:26

విత్తనాలు,ఎరువులు ప్రభుత్వం నిర్ధారించిన ధరలకే అమ్మకాలు చేపట్టాలని శంఖవరం వ్యవసాయ అధికారి పి.గాంధీ ట్రేడర్లకు సూచించారు. శుక్రవారం కాకినాడ జిల్లాలోని శంఖవరం మండలం కత్తిపుడి లోని విత్తనాలు, ఎరువుల దుకాణాలను సందర్శించి స్టాకును, రిజిష్టర్ లను తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ, ట్రేడర్లు షాప్ ల వద్ద ధరల పట్టిక ప్రదర్శించాలని, లైసెన్సులను రెవిన్యువల్ తప్పకుండా చేయించుకోవాలన్నారు. అనంతరం విత్తన నమూనాలను సేకరించి పరీక్ష నిమిత్తం నియోజకవర్గంలోని ప్రయోగశాలకు పంపించారు. అనంతరం రైతులతో వరి నారు మడులను పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ వ్యవసాయ సహాయకులు ప్రభాస్,చిన్నబాబు,రైతులు  తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు