అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
Ens Balu
2
Vizianagaram
2022-07-15 12:54:52
విజయగనగరం జిల్లా గంట్యాడ మండలంలోని రావివలస అంగన్‌వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి, గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కేంద్రంలో నమోదైన పిల్లల సంఖ్య, హాజరైన వారి వివరాలను పరిశీలించారు. వారికి ఇస్తున్న పోషకాహారంపై ఆరా తీశారు. పిల్లల ఎత్తు, బరువు, ఇతర ఆరోగ్య పరీక్షలు, టీకా కార్యక్రమం తదితర వివరాలపై, అంగన్‌వాడీ కార్యకర్తను ప్రశ్నించారు. సంబంధిత రికార్డులను పరిశీలించారు. పిల్లలతోపాటు, గర్భిణులకు, బాలింతలకు పెడుతున్న భోజనంపై ఆరా తీశారు. వాటి నాణ్యతపై తల్లులను ప్రశ్నించారు. లబ్దిదారులంతా కేంద్రాలకు వచ్చి భోజనం చేయాలని సూచించారు. ప్రతీఒక్కరూ కేంద్రానికి వచ్చేలా, వారిని చైతన్య పరచాలని అంగన్‌వాడీ వర్కర్‌ను కలెక్టర్ ఆదేశించారు.