విజయనగరం జిల్లా గజపతినగరంలోని ఎరువుల దుకాణాలను సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ శుక్రవారం ఆకశ్మీకంగా తనిఖీ చేశారు.విత్తనాలు , ఎరువులు, పురుగు మందులు సక్రమంగా విక్రయిస్తున్నదీ లేనిదీ తనిఖీ చేశారు. ఈ పోస్ ద్వారా విక్రయిస్తున్నారు లెస్స అని ఆరా తీశారు. గిడ్డంగిని కూడా తనిఖీ చేసి స్టాక్ వివరాలను పరిశీలించారు. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ నిర్ధేశిత రేట్లకే ఎరువులు, విత్తలను అమ్మాలని ట్రేడర్లకు సూచించారు. జె.సి వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తారక రామారావు, వ్యవసాయ శాఖ ఏ.డి. ఏ.ఓ తదితరలు పాల్గొన్నారు.