గొల్ల అవమానంపై మాజీఎమ్మెల్యే అనిత మౌనం సబబుకాదు


Ens Balu
4
S Rayavaram
2020-09-20 11:11:15

విశాఖజిల్లా పాయకరావుపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఏపి అసెంబ్లీ ఎస్సీ, ఎస్టీ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ గొల్లబాబూరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బొలిశెట్టి గోవింద్ విషయంలో మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత స్పందించకపోవడంపై దళిత సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది. ఒక దళితుడిని అగ్ర వర్ణాలకు చెందిన ఎస్.రాయవరం మాజీ ఎంపీటీసి బొలిశెట్టి కార్యకర్తల సమావేశంలో తీవ్రంగా మాట్లాడటంపై జిల్లా వ్యాప్తంగా దళిత సంఘాలు గొల్లు మన్నాయి. కానీ నియోజవకర్గంలోనే ఉన్న మాజీ ఎమ్మెల్యే కనీసం ఆ వ్యాఖ్యలను ఖండించకపోవడం, అధికారపార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనే కనీస ప్రోటో కాల్ పాటించకపోవడం పైనా నేటి వరకూ పెదవి విప్పక పోవడంపై ఎస్.రాయవరం టిడిపినేత తొడాల సంతోష్ కూడా తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేశారు. డా.బీఆర్ అంబేత్కర్ వారసులుగా ఒక దళితుడుకి జరిగిన అవమానంపై సాటి దళితుడు, మాజీ ఎమ్మెల్యే ఖండించాలని, ఇన్నిరోజులు జరుగుతున్నా, నోరుమెదకపోవడం దళితుల్లోనే ఐకమత్యాన్ని దెబ్బతీయడమేనని  సంకేతాన్ని పంపినట్టేనన్నారు. ఎక్కడో మారు మూల గ్రామాల్లో సైతం దళితులకు అవమానం జరిగితే రాష్ట్రవ్యాప్తంగా స్పందించే దళితులు, ఎమ్మెల్యే గొల్లబాబూరావుపై ఇష్టానుసారంగా మాట్లాడిన బొలిశెట్టి వ్యాఖ్యలను ఖండించాల్సిన అవసరం వుందన్నారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా వ్యాప్తంగా దళిత సంఘాల ఐఖ్యవేదిక కన్వీనర్ బూసి వెంకట్రావు, జిల్లా దళిత సమాఖ్య నాయకులు పుచ్చా విజయ్ కుమార్ లు ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలను మీడియా ముఖంగా ఖండించారనే విషయాన్ని సంతోష్ స్థానిక మీడియాకి ఆదివారం వివరించారు. ఇదే పద్దతి కొనసాగితే రానున్న రోజుల్లో దళితులకి అన్యాయం జరిగితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తక్షణమే మాజీ ఎమ్మెల్యే అనిత ఎమ్మెల్యే గొల్లబాబూరావుకి జరిగిన అవమాన విషయంలో తన అభిప్రాయాన్ని తెలియజేయాల్సి వుందని డిమాండ్ చేశారు.
సిఫార్సు