పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో కోతకు గురౌతున్నారు పొన్నపల్లి ప్రాంతంలో మరమ్మతు పనులను రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు శనివారం పరిశీలించారు. ఎగువ నుంచి దివకు నీరు ఎక్కువగా చేరుతున్నందున పట్టణంలో కోతకు గురౌతున్నారు పొన్నపల్లి ప్రాంతంలో పర్యటించారు. పట్టణం లో నీరు ఎక్కువ అవుతున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పరివెక్షించుకోవలని, అవసరాన్ని బట్టి వెంటనే నిర్ణయాలు తీసుకొని ప్రజలను అపరమత్తం చేసి వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నరసాపురం మున్సిపల్ చైర్ పర్సన్ బర్రె శ్రీ వెంకట రమణ , జడ్పిటిసి బోక్క రాధాకృష్ణ, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ శ్రీనివాస్, నరసాపురం తాసిల్దార్ ఎస్ ఎమ్ ఫాజిల్ , ఇతర శాఖల అధికారులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.