వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి


Ens Balu
17
Visakhapatnam
2022-07-16 09:52:14

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తెలిపారు.  శనివారం ఆమె 2వ జోన్ 11వ వార్డు పరిధిలోని ఆరిలోవ బాపూజీ నగర్ లోని వైయస్సార్ పార్టీ ఆఫీస్ లో  వైయస్సార్ పార్టీ నాయకులు ఇజ్ఞాడ సత్యనారాయణ ఆధ్వర్యంలో మెడి కవర్ హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్నికి నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చిందని ఈ ప్రాంతంలో ఉన్న చాలామంది పేదవారు శిబిరం ద్వారా ఈ సి జి, బిపి, షుగర్ తదితర పరీక్షలు ఉచితంగా చేసి మందులు పంపిణీ చేశారని తెలిపారు. ఇటువంటి శిబిరాలను నగరంలో ఉన్న మురికి వాడలో ఉన్న ప్రాంతాలలో పెట్టినట్లయితే ఆ ప్రాంతంలోని పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన వైయస్సార్ సిపి నాయకులు సత్యనారాయణ, మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం ని అభినందించారు.
సిఫార్సు