తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు మండలం మద్దూరులంక గ్రామంలో శనివారం ఉదయం పునరావాస చర్యలు ప్రత్యేక అధికారి హెచ్. అరుణ్ కుమార్, జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత లు పర్యటించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి హెచ్ అరుణ్ కుమార్ గ్రామస్థులతో మాట్లాడుతూ, 1986 నాటి వరదల పరిస్థితి, ప్రస్తుతం వస్తున్న వరదల పరిస్థితి లో చాలా వ్యత్యాసం ఉందన్నారు. అప్పుడు గోదావరి నదికి రక్షణ గట్లు లేవని, అందువల్ల వొచ్చిన వరదనీరు విస్తరించడం వలన ఎత్తు పెరిగిన సందర్భం చూడలేదని తెలిపారు. ఇప్పుడు నదికి బండ్ల ఏర్పాటు చెయ్యడం తో వరద నీరు వొచ్చే దిశాలో మార్పు వచ్చిందని తెలిపారు. ఇందువల్ల గ్రామంలోకి వరదనీరు వొచ్చే అవకాశం ఉందని తెలుస్తోందన్నారు. ఈ కారణాలను ద్రుష్టిలో పెట్టుకుని వరద బాధిత ప్రాంతాల ప్రజలు తప్పకుండా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళాలని కోరారు. జిల్లా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ నిన్నటి రోజున మద్దూరులంక గ్రామంలో పర్యటించి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలి రావాలని కోరినా స్పందన రావడం లేదని తెలిపారు. ఈ సందర్భంగా బోట్ ద్వారా ఇంటింటికీ వెళుతూ మీరు పునరావాస కేంద్రాలకు రావాలని ప్రజకు విజ్ఞప్తి చేశారు. సాయంత్రానికి మరో నాలుగు అడుగులు నీటి మట్టం పెరిగి మీ ఇంటిలోకి వొచ్చే అవకాశం ఉందని తెలిపారు. వరద నీటిని తక్కువ అంచనా వెయ్యవద్దని, తప్పనిసరిగా పునరావాస కేంద్రాలకు వొచ్చి తగిన భద్రత పొందాలని సూచించారు.
పునరావాస కేంద్రాలలో భోజన వసతి, దుప్పట్లు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. పై రాష్ట్రల నుంచి, పై ప్రాంతాల నుంచి పోలవరం ప్రాజెక్టును, అక్కడి మన ప్రాంతానికి వరద నీరు చేరడంతో నానాటికీ పరిస్థితి కొంత ఆందోళన కలిగించేలా ఉందన్నారు. ఎప్పటి కప్పుడు వరద నీరు విడుదలచేస్తున్నట్ట్టూ తెలిపారు. ప్రత్యేక అధికారి హెచ్.అరుణ్ కుమార్, జిల్లా కలెక్టర్ మాధవీలత బోట్ లో ప్రయాణం చేసి మద్దూరులంక గ్రామ ప్రజలు పునరావస కేంద్రాలకు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.