ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించాలని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సీహెచ్ నాగ నర్శింహారావు సూచించారు. శనివారం ఆయన రెండో డివిజన్ కృష్ణ నగర్‌లోని సచివాలయాన్ని సందర్శించారు. అక్కడి సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆధార్ కేంద్రాన్ని తనిఖీ చేసారు. ప్రజల సౌకర్యార్ధం కొత్త ఆధార్‌ల నమోదు, 15 ఏళ్ళ లోపు పిల్లల ఆధార్ కార్డులను అప్‌డేట్ చేసి, చిరునామాల్లో మార్పులు, ఆధార్ సంబంధిత ఇతర సేవలను ఈ కేంద్రం ద్వారా పొందవచ్చని చెప్పారు. తాజాగా ఈ కేంద్రం ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటి వరకు 188 మంది వినియోగించుకున్నట్లు అదనపు కమిషనర్‌కు సిబ్బంది వివరించారు. ఈ సందర్భంగా ఏడీసీ నాగ నర్శింహారావు మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా అందించే సేవలన్నింటినీ సచివాలయాల ద్వారా స్థానికంగానే ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం ఈ వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. ఇటీవలే సచివాలయ కార్యదర్శులకు రెగ్యులర్ పే స్కేలు కూడా ప్రకటించినందున ప్రతి ఉద్యోగి మరింత బాధ్యతగా పని చేయాలని సూచించారు. అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ పధకాలు అందడంలో సచివాలయ సిబ్బంది మరింత క్రియాశీలకంగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా కృషి చేయాలన్నారు