వరద ప్రాంతాల్లో మెరుగైన ఏర్పాట్లు చేశాం


Ens Balu
3
Achanta
2022-07-16 12:45:25

వరద తాకిడి గురైన ప్రాంతాల ప్రజలకు మెరుగైన ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్  పి. ప్రశాంతి తెలిపారు. జిల్లాలో 28 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయగా వాటిలో ఆచంట మండలంలో  9,  యలమంచిలి మండలంలో 15,  నరసాపురం మండలంలో 4 ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఆచంట మండలంలోని 9 పునరావాస కేంద్రాలలో వున్న 1,360 మందికి ఉదయం  టిఫిన్,  4,500 మందికి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని,  యలమంచిలి మండలంలోని 15 పునరావాస కేంద్రాలలో 6,124 మందికి ఉదయం  అల్పాహారం,  7, 350 మందికి మధ్యాహ్నం భోజనం అందించడం జరుగుచున్నదని ఆమె తెలిపారు. నరసాపురం మండలంలోని  4 పునరావాస కేంద్రాలలో 955 మందికి ఉదయం అల్పాహారం, 1095 మందికి  మధ్యాహ్నం భోజనం అందించడం జరుగుచున్నదని  తెలిపారు .   యలమంచి మండలంలో 1368 మంది పిల్లలకు 3,000 బ్రెడ్ ప్యాకెట్లు,  499 మంది పిల్లలకు 4,568 బిస్కెట్ ప్యాకెట్లు అందజేయడం జరిగిందని ,  ఆచంట మండలంలో 280 మంది పిల్లలకు 2,768 బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వడం జరిగిందని,  నరసాపురం మండలంలో 132 మంది పిల్లలకు 264 బ్రెడ్ ప్యాకెట్లు,  26 మందికి పిల్లలకు  240 బిస్కెట్ ప్యాకెట్లు మొత్తం మూడు మండలాలలో 7500 బిస్కెట్ ప్యాకెట్లు,  3,000 బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు.చిన్న పిల్లలు కలిగిన కుటుంబాలకు రెండు లీటర్లు, మామూలు కుటుంబాలకు ఒక లీటర్ చొప్పున మొత్తం 13,898 కుటుంబాలకు 16,198  లీటర్ల పాల ప్యాకెట్లు అందజేయడం జరిగిందన్నారు. వాటిలో ఆచంట మండలం 1,712 కుటుంబాలకు 1,992, యలమంచిలి మండలంలో 10,710 కుటుంబాలకు 12,572 ప్యాకెట్లు ,  నరసాపురం మండలంలోని 1,476 కుటుంబాలకు   1,634  పాల ప్యాకెట్లు  అందజేయడం జరిగిందని ఆమె వివరించారు.

వీటితోపాటు పశువులకు మేతకు సంబంధించి ఆచంట మండలంలో 2,955 పశువులకు 33 టన్నుల పశుగ్రాసం, యలమంచిలి మండలంలో 2,606 పశువులకు 78.5 టన్నులు , నరసాపురం మండలంలో 116 పశువులకు  3.45 టన్నుల పశుగ్రాసం , పెనుగొండ మండలంలో 647 పశువులకు 18 టన్నుల పశుగ్రాసం పంపిణీ చేయడం జరిగిందని మొత్తం 6,324  పశువులకు 132.95 టన్నుల పశుగ్రాసం అందజేయడం జరిగిందని ఆమె తెలిపారు.  వరద ముంపు గ్రామాల ప్రజలను తరలించేందుకు 75 బోట్లను,134 మంది గజఈ తగాళ్లను సిద్దంగా ఉంచడం జరిగిందని, దీనిలో  యలమంచిలి మండలం కనకాల లంకలో 15 బోట్లు, 30 మంది గజ ఈ తగాళ్ళు,  పెదలంకలో 5 బోట్లు,  10 మంది గజ ఈతగాళ్ళు ,  ఎలమంచిలి లంకలో 7 బోట్లు 14 మంది గజఈతగాళ్లు ,  దొడ్డిపట్లలో 2 బోట్లు 4గజ ఈతగాళ్ళు ,  లక్ష్మీపాలెంలో 3  బోట్లు 6 గజఈతగాళ్ళు ,  గంగడ పాలెం లో 1 బోటు 2 గజఈతగాళ్ళు , వైబి లంక బడవలో 7 బోట్లు 14 మంది గజ ఈతగాళ్లు,  ఆచంట మండలంలోని బడ్డేవారి పేటలో  2 బోట్లు నలుగురు గజ ఈతగాళ్ళు,  పల్లెపాలెంలో 6 బోట్లు 12 మంది గజ ఈతగాళ్ళు , మర్రి మూల గ్రామంలో 3  బోట్లు 6 గజ ఈతగాళ్ళు, పుచ్చలంకలో 6 బోట్లు 12 మంది గజ ఈతగాళ్లు,  అయోధ్య లంకలో 6 బోట్లు 12 మంది గజ ఈతగాళ్ళు , కోడేరు లంక పల్లిపాలెంలో 2  బోట్లు, 4 గజ ఈతగాళ్లు ,  పెదమల్లం లంకలో 2 బోట్లు, 4 గజ ఈతగాళ్ళు ను ఏర్పాటు చేయడం జరిగిందని,  వీటితో పాటు మరో 8 బొట్లు అదనంగా అవసరమైనచోట్లకు పంపించేందుకు సిద్ధంగా ఉంచడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ప్రజలకు  ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఆమె వివరించారు.
సిఫార్సు