ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే నటమాంత్రికుడు ఎస్వీ రంగారావు అని వాకర్స్ జిల్లా చైర్ పర్సన్ అడబాల రత్న ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడలోని సర్పవరం జంక్ష బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో ఎస్వీ రంగారావు 48 వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఎస్వీ రంగారావు 1918 జూలై మూడున నూజివీడులో జన్మించారన్నారు. గంభీర స్వరం, ఆహార్యం, రాజసం ఆయన సొంతమన్నారు. ఏ పాత్ర చేసినా తనదైన విశ్వరూపం ప్రదర్శించే వా రని అన్నారు. తన మార్కు నటనను పాత్రలో ఇనుముడింపజేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ఆయన లేని లోటు ఇంతవరకు ఏ నటుడు తీర్చలేనిదన్నది స్పష్టమని అడబాల తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజా, సత్యనారాయణ, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.