28 గ్రామాల ప్రజలకు 30 పునరావాసా కేంద్రాలు


Ens Balu
13
Narsapur
2022-07-18 10:33:59

వరదల వల్ల ధవలేశ్వరం దగ్గర 27 లక్షల క్యూసెక్కులు నీరు రావడం వల్ల పశ్చిమగోదావరి జిల్లా లో మూడు మండలాలలోని 28 గ్రామాలకు ప్రభావం చూపిందని ఈ గ్రామాలలోని ప్రజలను 30 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ  కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ , వరద  ఉపశమనం పునరావాస ప్రత్యేక అధికారి  ప్రవీణ్ కుమార్  తెలిపారు.  సోమవారం నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో  వరద ప్రభావిత గ్రామాలలోని ప్రజల  కోసం 30 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ,  పునరావాస కేంద్రాలకు ప్రజలను  తరలించడం జరిగిందని , పునరావాస కేంద్రాలకు రానివారందరికి  ఆ గ్రామాలలోని టిఫిన్ , మధ్యాహ్న భోజనం  ,రాత్రి భోజనం,  మంచినీరు ,  నిత్యవసర వస్తువులు 25 కేజీల బియ్యం , ఒక కేజీ కందిపప్పు ,  ఒక కేజీ ఆయిల్ , కేజీ టమాట , కేజీ ఉల్లిపాయలు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు.  ప్రస్తుతం వరద స్థాయి తగ్గుతున్నందున గ్రామాలలో అంటువ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున వచ్చే 48 గంటల్లో ప్రత్యేకమైన  పరిశుద్య కార్యక్రమాలు , హెల్త్ క్యాంపులు నిర్వహించి గ్రామాలలోని మంచినీరు ట్యాంకులను శుభ్రం చేయడం , స్వచ్ఛమైన మంచినీరు అందించేందుకు ప్రణాళిక రూపొందించడం జరిగిందని ఆయన తెలిపారు. 

   వరద ప్రభావ ప్రాంతాలలోని ప్రతి కుటుంబానికి  రెండు వేల రూపాయలు చొప్పున వారి అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. జిల్లా యంత్రాంగం అంతా ఇక్కడే వరద ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు నిమగ్నమై ఉన్నదని ఆయన తెలిపారు.  పునరావాస కేంద్రాలలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ వసతులు సమకూర్చడం జరిగిందని తెలిపారు.పొన్నపల్లి లో ఏటిగట్టు కోతకు గురవుతున్నందున  దానిని పటిష్ట పరిచేందుకు   ప్రణాళిక రూపొందించడం జరిగిందని , దానికి అంచనాలతో రూపొందించడం జరిగిందని ఆయన తెలిపారు. వాటర్ ట్యాంకులు కూడా పెట్రోలింగ్ చేయడం జరుగుతుందని, వచ్చే ఐదు రోజులు పునరావాస కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. రెండు , మూడు రోజులు ప్రజలు కూడా సహనంతో ఉండి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు.  వరద పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని రెండు కోట్ల రూపాయలు అదనంగా కలెక్టర్ గారు అడిగారాని  వేను వెంటనే  ముఖ్య మంత్రి  రూ.  2 కోట్లు  మంజూరు ఉత్తర్వులు జారీ చేశారని ప్రవీణ్ కుమార్ తెలిపారు.

జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలోని యలమంచిలి, ఆచంట, నరసాపురం మండలంలోని 28 లంక గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలను తరలించడం జరిగింది వారికి అవసరమైన పాలు ,  మంచినీరు , బిస్కెట్లు  భోజనం   ఇంటి వద్ద ఉన్న వారికి కూడా అందించడం జరుగుతుందని ఆమె తెలిపారు. జిల్లాలో 38 ప్రాంతాలలో గట్లు బలహీనంగా  ఉన్నట్లు గుర్తించి వాటిని పటిష్ఠం చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.అయా ప్రాంతాల్లో ఉన్న వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందని కలెక్టర్ అన్నారు. వీఆర్వోలు , పంచాయతీ సెక్రటరీ తది తర సిబ్బంది అందరూ గ్రామాల్లో ఉండి ప్రజలను అప్రమత్తం చేస్తూ  సమాచారం  జిల్లాలోని కంట్రోల్ రూమ్ కు తెలియజేయడం జరుగుతుందని, అక్కడ నుండి మానిటర్ చేసి అన్ని వసతులు సమకూర్చడం జరుగుతుందని ఆమె తెలిపారు. వచ్చే 48 గంటల్లో సానిటేషన్  ,డ్రింకింగ్ వాటర్ , వైద్యంపై ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. మండలాలలో, గ్రామాలలో ఏదైనా సమస్య వచ్చినట్లయితే జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ నెంబరు 08816299189  కి ఫోన్ చేసి తెలియజేయాలని కలెక్టరు  పి.ప్రశాంతి తెలిపారు. ఈ పత్రిక విలేకరుల సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టరు జె వి మురళి తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు