బూస్టర్ డోస్ తప్పక వేయించుకోవాలి


Ens Balu
5
Sankhavaram
2022-07-18 12:06:17

కోవిడ్ నియంత్రణలో భాగంగా 18 ఏళ్ళు నిండిన ప్రతీ ఒక్కరూ కోవిడ్ బూస్టర్ డోస్ టీకా తప్పనిసరి గా వేయించుకోవాలని కత్తిపూడి గ్రామ సర్పంచ్ కొల్లు వెంకట సత్యనారాయణ  సూచించారు. కాకినాడ జిల్లాలోని  శంఖవరం మండలం లోని కత్తిపూడి గ్రామ పంచాయతీ లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని సర్పంచి ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో  రెండు డోస్ లు తీసుకున్న ప్రతీ ఒకరు బూస్టర్ డోస్ తీసుకోవాలన్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ ప్రత్యేక శిభిరాలు ఏర్పాటు చేస్తోందని పేర్కొన్నారు.  జూలై15 నుంచి 75 రోజుల పాటు నిర్వహించే ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ఇప్పటికే 60 సంవత్సరాల వయస్సు దాటిన వారికి బూస్టర్ డోస్ ను వైద్య సిబ్బంది అందిస్తున్నారన్నారు.  వీరితో పాటు 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గలవారందరూ  ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో  పంచాయతీ కార్యదర్శి కె.శ్రీనివాస్, హెవి ధనలక్ష్మి, ఏఎన్ఎం నాగమణి, యమ్ ఎల్ హెచ్ పి మాధవి లత పంచాయతీ  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు