తూర్పుగోదావరి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు స్థానిక ఆర్యపురం, తుమ్మలావ వంటి లోతట్టు ప్రాంతాలు జలమయం అయిన ప్రాంతాల్లో కమీషనర్ కె.దినేష్ కుమార్ ,ఇంజినీరింగ్ అధికారులు సోమవారం ఉదయం పర్యటించారు. ఈ సమస్యకు పరిష్కారం దిశ గా యుద్ధప్రాతిపదికన నగరపాలక సంస్థ చర్యలు చేపట్టినట్టు కమీషనర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. 250 హార్స్ పవర్ మోటార్ ను నల్లా ఛానెల్ వద్ద ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మురుగు నీటిని పంపింగ్ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. నల్లా ఛానెల్ దగ్గర లో ఉన్న ఎ. బి. నాగేశ్వర రావు పార్క్ ను అత్యవసర సమయం లో రిజర్వాయర్ గా ఉపయోగించాలని సూచించారు. వరద నీరు తగ్గిన వెంటనే పేరుకుపోయిన బురద, మురుగు ను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. అనంతరం అంటూ వ్యాధులు ప్రబలకుండా శానిటేషన్ సిబ్బంది బ్లీచింగ్ చల్లాలని ఆదేశించారు. వరద ఉధృతి తగ్గే వరకూ ప్రత్యేక సిబ్బంది ని ఈ ప్రాంతంలో నియమిస్తున్నట్టు కమీషనర్ తెలిపారు. కమీషనర్ వెంట ఎస్ ఈ పాండు రంగారావు, ఎమ్ హెచ్ ఓ వినూత్న, ఇతర ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.