ప్రభుత్వ బ్యాంకుల్లోనే ఆర్థిక భద్రత


Ens Balu
3
Kakinada
2022-07-19 08:34:14

ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బుకు ప్రభుత్వ బ్యాంకులలో పూర్తి భద్రత లభిస్తుందని ఇండియన్ బ్యాంకు విశ్రాంతి ఉద్యోగి ఎంపీవి ప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ రమణయ్యపేట ఏపీఐఐసీ కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో  బ్యాంకుల జాతీయకరణ దినోత్సవం పురస్కరించుకుని జరిగిన  కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. బ్యాంక్ అంటే డిపాజిట్లను స్వీకరించడం, అవసరమైన వారికి రుణాలు ఇవ్వడానికి లైసెన్స్ పొందిన ఆర్థిక సంస్థ అని అన్నారు. ప్రైవేట్ గుత్తాధిపత్యాన్ని నియంత్రించడానికి, సాంఘిక సంక్షేమం కోసం 1969 జూలై 19న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలోని 85% బ్యాంకు డిపాజిట్లు కలిగిన 14 ప్రధాన బ్యాంకులను జాతీయం చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారని అన్నారు. ప్రభుత్వ బ్యాంకులలో డిపాజిట్లు చేయడం వలన కొద్దిగా వడ్డీ తగ్గినా  నిశ్చింతగా ఉండవచ్చు అన్నారు. ప్రైవేట్ బ్యాంకు యాజమాన్యాలు లాబాపేక్షతో పనిచేస్తాయన్నారు. అదేవిధంగా డిపాజిట్ దారులకు భద్రత కూడా కొరవడుతుందని అన్నారు. జాతి నిర్మాణంలో ప్రభుత్వ బ్యాంకులు ఎల్లప్పుడు తోడ్పాటు అందిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ లక్ష్యాలు క్షేత్రస్థాయిలో విజవంతం కావడానికి జాతీయ బ్యాంకులు ఎంతగానో తోడ్పడుతున్నాయని ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా అడబాల రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో ఎంపీవి ప్రసాద్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రవిశంకర్ పట్నాయక్, రాజా, బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.                     
సిఫార్సు