కాకినాడ సర్పవరం జంక్షన్ లో శ్రీరామ నామ క్షేత్రం, ఆంధ్ర భద్రాద్రి ఆధ్వర్యంలో భారతమాత ముద్దుబిడ్డ, విప్లవ వీరుడు మంగళ్ పాండే జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ మాట్లాడుతూ 1827 జూలై 19న మంగల్ పాండే ఉత్తరప్రదేశ్లో జన్మించారని అన్నారు. 1849లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో చేరాడని అన్నారు. భారత జాతి పౌరుషాన్ని బ్రిటిష్ వారికి రుచి చూపించిన దీశాలి, దేశభక్తుడు మంగల్ పాండే అన్నారు. బ్రిటిష్ అధికారులపై దాడి చేసిన మొదటి భారతీయ సైనికుడు పాండే అన్నారు. 1857 ఏప్రిల్ 8న బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను ఉరి తీసింది అని అన్నారు. అతని స్మారక చిహ్నంగా భారత ప్రభుత్వం 1984లో తపాలా బిళ్ళను విడుదల చేసిందని పట్నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజా, అడబాల రత్న ప్రసాద్, బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.