గోదావరి పరివాహ ప్రాంతాలలో ముంపునకు గురైన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తున్న ట్లు వరదల ప్రత్యేక అధికారి కార్తికేయ మిశ్రా తెలిపారు. మంగళవారం స్థానిక ఐటీడీఏ సమావేశపు హాలులో వరదల ప్రత్యేక అధికారి కార్తికేయ మిశ్రాతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వరద బాధితుల సహాయ చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ చింతూరు, ఎటపాక, కూనవరం, వి ఆర్ పురం, మండలాలలో వరద బాధితులకు తక్షణ సహాయం కింద ముందుగా ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఒక వ్యక్తి ఉన్న కుటుంబానికి వెయ్యి రూపాయలు, ఇద్దరు, అంత కన్నా ఎక్కువ మంది వ్యక్తులు ఉన్న కుటుంబాలకు రెండు వేల రూపాయలు చొప్పున బాధితులకు అందజేయడం జరుగుతుందని వివరించారు. అదేవిధంగా వరద ముంపునకు గురైన బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ పామ్ ఆయిల్, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, కిరోసిన్, బ్లాంకెట్స్, టార్ఫాలిన్స్, పాలు, బిస్కెట్స్, తదితర నిత్యవసర వస్తువులు సరఫరా చేయడం జరిగిందని తెలిపారు. రాజమండ్రి, కాకినాడ, నుండి 190 మందిని పారిశుధ్య కార్మికులను వరద ప్రాంతాలకు తీసుకురావడం జరిగిందని, వారిని కూనవరం, యాటపాక, వి ఆర్ పురం, చింతూరు మండలాల్లో పారిశుద్ధ్యం నిర్వహణకు కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు.
ఈ నాలుగు మండలాల్లోని ప్రతి గ్రామంలో త్రాగునీరు ఏర్పాటు చేయడం జరుగిందని పేర్కొన్నారు, అదేవిధంగా ప్రతి గ్రామంలో బోర్లు మరమ్మతులను వెంటనే చేపట్టాలని సంబంధిత అధికారులను ప్రత్యేక అధికారి ఆదేశించారు. ముంపునకు గురైన అన్ని గ్రామాలలో అంటువ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని, మండల కేంద్రాల్లో 104 వాహనం ద్వారా వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అదేవిధంగా ముంపునకు గురైన అన్ని గ్రామా సచివాలయాలలో ఒక షెడ్యూల్ తయారుచేసి ఆ షెడ్యూల్ ప్రకారం వరద బాధితులకు వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను ప్రత్యేక అధికారి ఆదేశించారు. వరద పరివాహక ప్రాంతాలలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించిన వైద్యాధికారులు అవసరమైన మందులను సిద్ధం చేసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వరద ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య సేవలు అందించేందుకు పదిమంది వైద్యాధికారులు అవసరం ఉందని డిఎంహెచ్ఓ ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకు వచ్చారు. వరద పరివాహ ప్రాంతాలలో ఎన్ని శాటిలైట్ ఫోన్లు ఉపయోగించుచున్నది ఆరా తీశారు. ఎన్ డి ఆర్ ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, ఫైర్ సర్వీస్ శాఖల ద్వారా వరదలు తగ్గిన వెంటనే రాకపోకలకు ఇబ్బంది లేకుండా రోడ్లుఫై ఉన్న మట్టిని, బురదని, తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా వరద బాధితులకు సహాయ సహకార అందించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అధికారులకు గదికి 20 బెడ్లు చొప్పున ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ సతీష్ కుమార్, ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కిషోర్, చింతూరు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి, రామశేషు, డిఆర్ఓ బి దయానిధి, జిల్లా పంచాయతీ అధికారులు టి కొండల రావు, కాకినాడ డిపిఓ నాగేశ్వరరావు నాయక్, అదనపు డిఎంహెచ్వో పుల్లయ్య, గ్రామీణ నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, చింతూరు తాసిల్దార్ రాధాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.