గోదావరి వరద పూర్తి స్థాయిలో యధా స్థితికి వచ్చే వరకు బాధితులు పునరావాస కేంద్రాల్లో ఉండాలని ,అన్ని సౌకర్యాలు కల్పించామని ప్రభుత్వ చీఫ్ విఫ్, శాసనసభ్యులు ముదునూరి ప్రసాద్ రాజు, జిల్లా జాయింట్ కలెక్టరు జె వి మురళి కోరారు. మంగళవారం నరసాపురం 29 వార్డు అరుంధతి పేట,4 వ వార్డు పొన్నపల్లి ,గోదావరి ఎటుగట్లను, మోటార్ల సాయంతో నీటిని బయటకు తోడుతున్న విధానాన్ని, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ముదునూరి. ప్రసాద రాజు మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పరిస్థితిని రాష్ట్ర ముఖ్య మంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకు వెళ్ళుట,వారు పరిస్థిని అడిగితెలుసు కునుట వారి ఆదేశాలు ,జిల్లా యంత్రాంగం అంతా మాకాం వేసి వరద సహాయ కార్యక్రమాలల్లో నిమగ్నఅగుట బాధితులకు ధైర్యం భరోసా కల్పించామని ఆయన అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలను తరలించడం వారికి అవసరమైన పాలు , మంచినీరు , బిస్కెట్లు భోజనం అందించడం ప్రతి రోజూ జరుగుతుందని ఆయన తెలిపారు.ముంపుకు గురైన బాధితులకు త్వరగా నిత్యవసర వస్తువులు, ప్రభుత్వం నుంచి అందుతున్న నగదు సహాయం లబ్దిదారులందరికీ చేరే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా జాయింటు కలెక్టర్ జె వి మురళిని ఆయన కోరారు. ఎటుగట్లు బలహీనంగా ఉన్నట్లు గుర్తించి వాటిని పటిష్ఠం చేయడం జరిగిందని ,పకృతికి ఎవ్వరూ ఎదురు వెళ్లలేమని అయితే ఎక్కడా ప్రాణ నష్టం లేకుండా , అస్థి తది తర నష్టాలు కొంతవరకు తగ్గించగలిగామని ప్రసాదు రాజు తెలిపారు.
జిల్లా జాయింటు కలెక్టరు జె వి మురళి మాట్లాడుతూ అధికారులు, వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయం ప్రతి ఒక్క లబ్ధిదారులకు చేరే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. అతి తక్కువ సమయంలో వారికి చేరుకుంటాయి అన్నారు. వీఆర్వోలు , పంచాయతీ సెక్రటరీ తది తర సిబ్బంది అందరూ గ్రామాల్లో ,పునరావాస కేంద్రాల్లో ఉండి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారన్నారు.శానిటేషన్ ,డ్రింకింగ్ వాటర్ , వైద్యంపై ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. మండలాలలో, గ్రామాలలో ఏదైనా సమస్య వచ్చినట్లయితే జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ నెంబరు 08816299189 కి ఫోన్ చేసి తెలియజేయాలని ఆయన కోరారు.గోదావరి ఏటు గట్లు బలహీనంగా ఉన్నవి గుర్తించి వాటిని పటిష్ట పరిచామని ఎవరూ భయంందోళన చెందనవసరం లేదని, ప్రజలంతా అధికారులు సూచనలు సలహాలు పాటించాలని జిల్లా జాయింటు కలెక్టరు జె వి మురళి కోరారు. ఈ పర్యటనలో నరసాపురం సబ్ కలెక్టరు సి. విష్ణు చరణ్, భీమవరం ఆర్ డి వో దాసి రాజు, మున్సిపల్ చైర్పర్సన్ బర్రి. శ్రీవెంకట రమణ, తహశీల్దారు యస్ యం ఫాజిల్, కౌన్సిలరు సిర్రా.కాంతమ్మ, దొంగ మురళి కృష్ణ , తది తర వార్డు కౌన్సిలర్స్, తదితరులు పాల్గొన్నారు.