సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి


Ens Balu
1
Palakonda
2022-07-19 12:19:44

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీతంపేట ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి.నవ్య వైద్యులను ఆదేశించారు. పాలకొండ ఏరియా హాస్పిటల్ ని ఐటీడీఏ పీఒ నవ్య మంగళ వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యం అందిస్తున్న తీరు ముఖ్యంగా పేదలకు వైద్యం అందుతున్న తీరును ఆరాతీశారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులకు ఆదేశించారు. మలేరియా, టైఫాయిడ్, అతిసార, డెంగ్యూ కేసులు అధికంగా వచ్చే ప్రమాదం ఉందని ఆమె పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులకు చికిత్స అందించడం కోసం అవసరమగు మందులు సిద్ధం చేయాలని ఆమె సూచించారు. దోమలు వ్యాప్తి కాకుండా చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. దోమల నివారణకు స్ప్రేయింగ్ పక్కాగా జరగాలని, దోమ తెరలు వినియోగించాలని ఆమె పేర్కొన్నారు. మునిసిపాలిటి, గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ పక్కాగా ఉండాలని ఎటువంటి నిర్లక్ష్యం ఉండరాదని ఆమె ఆదేశించారు. తాగు నీటి వసతులను క్లోరినేషన్ చేయాలని సూచించారు.

 సచివాలయం సిబ్బంది తమ పరిధిలో పారిశుధ్యం, క్లోరినేషన్, దోమల నివారణ, త్రాగు నీరు, ఆహార పదార్థాల వినియోగం తదితర అంశాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. రానున్న మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.  పాలకొండ నగర పంచాయతీ పరిధిలో లంబూరు జగనన్న హౌసింగ్ ఇళ్ళను ప్రాజెక్టు అధికారి పరిశీలించారు. నిర్మాణాలు వేగవంతం చేయాలని  పాలకొండ నగర పంచాయతీ కమిషనర్  రామారావును ఆదేశించారు. హౌసింగ్ బిల్లులు అందించాలని ఆదేశాలు జారీ జేశారు.  నగర పంచాయతీ కమిషనర్ రామారావు మాట్లాడుతూ  ప్రతి వార్డు లో పర్యటించి  ఇళ్ల నిర్మాణాలు  పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ జె. రవీంద్ర కుమార్, తదితరులు పాల్గొన్నారు
సిఫార్సు