వరి నారుమళ్లు తయారీలో రైతులు జాగ్రత్తలు పాటించాలని శంఖవరం మండల వ్యవసాయ అధికారి పడాల.గాంధీ సూచించారు. మంగళవారం అన్నవరం లో రైతులతో నారుమళ్లు తయారీ, విత్తనాలు వేసే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికా మాట్లాడుతూ, ఐదు సెంట్ల నారు మడిలో 5కిలోల యూరియా, 6కిలోల సూపర్ ఫాస్ఫేట్, 2కిలోల పొటాష్ వేసుకుని కలియ దున్నిన తరువాత మాత్రమే 20కిలోల విత్తనాలు చల్లుకోవాలని సూచించారు. ఐదు సెంట్ల నారుమడి ఒక ఎకర పొలంలో నాట్లు వేసుకోడానికి సరిపోతుందన్నారు. వ్యవసాయ క్షేత్రంలో రైతులకు సూచనలు, సలహాల కోసం గ్రామ సచివాలయంలోని వ్యవసాయ సహాయకుల సహకారం తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పరంగా ఇచ్చిన సూచనలు, సలహాలు పాటించడం ద్వారా మంచి దిగుబడి సాధించడానికి ఆస్కారం వుంటుందన్నారు. ఈకార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు మణికంఠ,రైతులు పాల్గొన్నారు.