ఇంజినీరింగ్ శాఖలు తమ లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనేంట్ నిధులతో జరుగుతున్న పనులపై సంబంధిత ఇంజినీరింగ్ శాఖల అధికారులతో మంగళ వారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సమీక్షించారు. మెటీరియల్ కాంపోనేంట్ నిధులను విడుదల చేయడం జరిగిందని పనులు పురోగతి కనిపించాలని ఆయన పేర్కొన్నారు. సిమెంట్, ఇతర సామాగ్రి పంపిణీ జరిగిందని తమ అధీనంలో జరుగుతున్న పనులపై ప్రత్యేక శ్రద్ద వహించాలని ఆయన చెప్పారు. ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనేంట్ నిధులతో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్ నెస్ కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలు జరుగుతున్నాయని పేర్కొంటూ భవనాల నిర్మాణం పూర్తి చేయడం వల్ల ఆ ప్రాంతంలో ఒక మౌళిక సదుపాయం అందుబాటులోకి వస్తుందన్నారు. ఎక్కువ పనులు పూర్తి చేసామనే సంతృప్తి పొందాలని సూచించారు. మెటీరియల్ కాంపోనేంట్ నిధులు గ్రామీణ ప్రాంతాలకు వరమని దానిని సద్వినియోగం చేయాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారి డా. ఎం.వి.జి కృష్ణాజి, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ అధికారి జి. మురళి, వివిధ శాఖల ఉప కార్యనిర్వాహణ ఇంజినీర్లు, సహాయ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.