అనకాపల్లి జిల్లా దేవరాపల్లి, మండలంలోని చింతలపూడి పంచాయతీ బోడిగరువు నేరేళ్ళ పూడి గిరిపుత్రులకు డోలీమోత కష్టాలు తప్పడం లేదు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు నియోజవర్గంలో పరిస్థితి ఇంత దారుణంగా వుందనడానికి గిరిజనులు పడుతున్న అవస్థలే నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఈ ప్రాంతానికి సరైన రోడ్డు సదుపాయం లేకపోవడంతో ఈ గ్రామానికి చెందిన చెందిన గిరిజనులు ఎవరికైనా ఆరోగ్యం మందగిస్తే డోలీ మోతలతోనే ఏరు దాటాల్సి వస్తుంది. గురువారం తెల్లవారుజామున వ్రుద్ధురాలికి ఆరోగ్యం క్షీణించడంతో చింతలపూడి బ్రిడ్జి వరకు ఐదు కిలోమీటర్లు దూరం డోలిలో మోసుకోచ్చి యస్.కోట ప్రైవేటు ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు. ఇపుడే కాదు ఈ ప్రాంతంలో ఎవరికి ఓంట్లో బాగోలేకపోయినా ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు గిరిజనులు. 2నెలలు క్రితం ఇదే గ్రామానికి చేందిన గర్భిణీ సాహుశాంతిని డోలికట్టి మెయిన్ రోడ్డుకు తీసురాగా.. వారం రోజులు క్రితం పోయిరి దారప్పను డోలికట్టి తీసుకు వచ్చామమిన..నేడు వ్రుద్ధురాలిని డోలికట్టి తీసు వస్తున్నామని గిరిజనులు వాపోతున్నారు.
శారదా నది ప్రవాహం ఎక్కువ అయితే ప్రాణాలు ఏటవతలే పోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గిరిజనులు ఇంత దారుణమైన ఇబ్బదులు ఎదుర్కొంటున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి,వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమండలంలోని ఈ ఓక్కగ్రామమే కాదని పూలగరువు కోడాపల్లి రామాన్నపాలెం,బుచ్చపాలెం తాటిపూడి వీరబద్రపేట నేరేళ్ళపూడి గిరిజన గ్రామాలకు లింక్ రోడ్లు సౌకర్యాలు లేక గిరిజనులకు నానాపాట్లు పడుతున్నారని అన్నారు. ఈ గ్రామాలకు లింక్ రోడ్లు సౌకర్యం కల్పించండి మహాప్రభో మంత్రి గారు అంటూ గిరిజనులు మోరపెట్టు కున్నా ఫలితం నేటికీ కనిపించడం లేదన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి75 ఏళ్లు పూర్తవుతున్నా..నేటి తమ గ్రామాలకు మాత్రం రోడ్డు సౌకర్యం కలగలేదని.. మారుమూల గిరిజనుల పట్ల ఇంత నిర్లక్ష్యం తగదని అంటున్నారు. ఎవరి ఆరోగ్యం బాగలేక పోయిన చిన్న పిల్లలు,ముసలి వారిని గర్బిని స్త్రీలను డోలిమోతలతోనే మోసుకోని మేయిన్ రోడ్డుకు తీసుకురావసి వస్తుందని చెబుతున్నారు. నేరెళ్ళపూడి, బలిపురం, తాటిపూడి, మదన గరువు గ్రామాలుయెక్క గిరిజనులు పరిస్థితిని అర్ధం చేసుకొని ప్రభుత్వం తక్షణమే రోడ్లు వేయించాలని గిరిజనులు ముక్త కంఠంతో కోరుతున్నారు.