కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి


Ens Balu
2
Visakhapatnam
2022-07-28 08:37:15

కాంట్రాక్టు కార్మికుల సమస్య లను తక్షణమే పరిష్కరించి, చట్టపరంగా కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈస్ట్ కోస్ట్ రైల్వే కాంట్రాక్టు కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో గురువారం డిఆర్ఎమ్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనియన్ జనరల్ సెక్రటరీ ఒ అప్పారావు మాట్లాడుతూ, రైల్వే ఎన్ సిసి లో అప్పర్ గేర్ కార్మికులకు కాంట్రాక్టరు ఓరియెంటల్ సెక్యూరిటీ సర్వీసస్ యజమాని గత ఆరు నెలలుగా పీఎఫ్, ఈఎస్ఐ చెల్లింలేదన్నారు. కాంట్రాక్టర్లంతా ప్రస్తుతం కాంట్రాక్టును ముగించుకొని వెళ్ళిపోయే పనిలో ఉన్నారని అన్నారు. ఇక్కడ పనిచేసే కార్మికులందరూ స్కిల్డ్ కార్మికులు అని , అయినా నెలకు 10 వేల రూపాయలు మాత్రమే జీతంగా ఇస్తున్నారన్నారు. రైల్వే స్టేషన్ ఎ 1 ఫెసిలిటీస్ ప్రయివేటు లిమిటెడ్ యజమాని పని చేస్తున్న కార్మికులకు చట్టపరంగా జీతాలు ఇవ్వలేదని, కరోనా పేరు మీద అనేక మంది కార్మికులను విధుల నుండి తొలగించారని అన్నారు. ఎన్ సిసి లో సి అండ్ డబ్ల్యు 180 మంది కార్మికులకు నెలలో 3 మస్తర్ల జీతాలను కాంట్రాక్టరు తినేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేసారు. రైల్వే కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని అన్నారు.  ఈ సమస్యలును తీర్చే వరకూ పోరాడుతామని అన్నారు. ఈకార్యక్రమంలో సిఐటియు జోన్ ప్రెసిడెంట్ బి సింహాచలం, నాయకులు ఎస్ శ్రావణ్, కార్మికులు రాజుతల్లి, అర్జున్, హరికృష్ణ, శివ, నూకరాజు, ఎన్ రమణ, ఎన్ నరేష్, బి సన్నిబాబు, ఎమ్ సత్యనారాయణ, బి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు