ఏటిగట్టు పనులు సత్వరమే పూర్తిచేయాలి


Ens Balu
6
Narsapur
2022-07-28 10:22:27

వరద కోతకు గురైన గోదావరి ఏటుగట్టు తాత్కాలిక మరమ్మత్తు పనులను 15 రోజుల్లోగా పూర్తి చేయ్యాలని జిల్లా కలెక్టరు  పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఇటీవల గోదావరి వరద కారణంగా నరసాపురం పట్టణం పొన్నపల్లి 4 వార్డు వద్ద ఏటిగట్టు కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు.  అనంతరం జిల్లా కలెక్టర్ నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షిస్తూ 56 లక్షల 60 వేల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన ఏటి గట్టు తాత్కాలిక మరమ్మత్తు పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంలో కన్జర్వెన్సీ సహాయక ఇంజనీరు కె వి సుబ్బారావు జిల్లా కలెక్టర్ కు వివరిస్తూ ఏటుగట్లు తాత్కాలిక పటిష్టపనులు  2, 4 వార్డులలో పొన్నపల్లి రేవు నుండి అమరేశ్వర స్వామి రేవు వరకు సుమారు 400 మీటర్ల మేర పనులు చేపట్టడం జరిగిందని,  ఇందుకు అవసరమైన పనివాళ్ళ, ఇసుక బస్తాలు, ఏదురు బొంగులు , ఏదురు  తడికేలు తదితర సామగ్రి సిద్దంగా చేశామన్నారు. గోదావరి ఏటిగట్టు తాత్కాలిక మరమ్మత్తు పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామని జిల్లా కలెక్టరుకు తెలిపారు.

ఈ సంధర్భంగా కలెక్టరు మాట్లాడుతూ అధిక వర్షాలు వలన గోదావరి ఉదృతంగా ప్రవహించడంతో ఏటి గట్టు  కోతకు గురైంది అని, తాత్కాలిక మరమ్మత్తు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆమె తెలిపారు. యాధాస్ధితికి వచ్చాక గోదావరి ఏటిగట్టుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారానికి   గ్రోయల్స్ ఏర్పాటుతో పాటు ఫుట్ పాత్ పునర్నిర్మాణం చేసి  పటిష్టం చేస్తామని అమె అన్నారు.  గోదావరి ఏటిగట్ల పటిష్టత వలన భవిష్యత్తులో లోతట్టు ప్రాంతాల ప్రజలకు వరద ముంపు లేకుండా భద్రత కల్పించడమే ప్రధమ లక్ష్యం  అన్నారు. వరద కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజల జీవనానికి ఇబ్బంది లేని విధంగా కరకట్ట ప్రతిష్టతకు పక్కా ప్రణాళికలను రూపొందించడం జరిగిందని, నదీ ప్రవాహం యధాస్థితికి వచ్చిన అనంతరం ఏటిగట్లకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టరు తెలిపారు. జిల్లా కలెక్టరు వెంట సబ్ కలెక్టరు సి .విష్ణు చరణ్, తహశీల్దారు యస్ యం ఫాజిల్, కన్జర్వెన్సీ సహాయక ఇంజనీరు కె వి సుబ్బారావు, తదితరులు వున్నారు.
సిఫార్సు