తిరుపతి జూలై 29 న అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శన శాలలో రాష్ట్ర స్థాయి ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి క్యాంప్ కార్యాలయం పేర్కొంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ, మైనింగ్ , విద్యుత్ శాఖా మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి, రాష్ట్ర అటవీ దళాల అధిపతి వై.మధుసూధన్ రెడ్డి , ఇతర అటవీశాఖ ముఖ్య అతిధిలుగా హాజరు కానున్నారని, ప్రతి ఏటా జూలై 29 వ తేదీన అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని జరుపుకోవటం ఒక ఆనవాతీగా వస్తోందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో పులుల ప్రాముఖ్యత ను గుర్తించిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో పులుల సంతతిని పెంచడానికి, వాటి సంరక్షణ కు రాష్ట్ర అటవీ శాఖకు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వడమే కాకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వస్తున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అటవీ శాఖా మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి చొరవతో రాష్ట్ర స్థాయి పులుల దినోత్సవ కార్యక్రమాన్ని తిరుపతి జూ పార్క్ లో ఏర్పాటు చేయనున్నట్టు ఆ ప్రకటనలో తెలియజేశారు.