ఐ.టి. చెల్లింపులకు ఆటంకం లేదు


Ens Balu
8
Anakapalle
2022-07-28 11:36:35

జనవరి నెల జీతాలు రాష్ట్ర ఖజానా సంచాలకుల ద్వారా నేరుగా చెల్లించి నప్పటికీ ఉద్యోగులకు వారి ఆదాయపు పన్ను రిటర్న్ లు దాఖలు చేసేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండదని జిల్లా ఖజానాధికారి వి.లక్ష్మీ సుభాషిణి తెలిపారు. గురువారం ఈ మేరకు అనకాపల్లి జిల్లాలో ప్రకటన విడుదల చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ 2022 జనవరి నెలకి సంబంధించిన వేతనాలు నేరుగా సంచాలకుల వారే చెల్లించుట జరుగగా మిగిలిన 11 నెలల జీతం ఆయా కార్యాలయాల డిడిఓల ద్వారా చెల్లించినట్టు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల జనవరి నెల ఆదాయపు పన్నును వేరువేరు భాగాలుగా సంచాలకుల "టేన్" (TAN) ను ఉపయోగించి  అప్లోడ్ చేశామని తెలిపారు. ఈ విషయాన్ని డ్రాయింగ్ అధికారులు తమ పరిధిలోని ఉద్యోగులకు పరిస్థితిని తెలియజేసి 12 నెలలకు సంబంధించి ఫారం-16ను ఫారం-26ASని దృష్టిలో పెట్టుకొని జారీ చేయవలసిందిగా ఆమె ప్రభుత్వశాఖల అధికారులను ఆమె మీడియాకి విడుదల చేసిన ప్రకటన ద్వారా కోరారు.
సిఫార్సు