విద్యుత్ ప్రగతి తోనే దేశ ఉజ్వల భవిష్యత్ ను సాధించవచ్చని భీమిలి శాసన సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాస రావు పేర్కొన్నారు. అజాద్ కా అమృత్ మహాత్సవంలో భాగంగా గురువారం ఉదయం అనందపురంలో రాష్ట్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మానవ జీవనశైలిలో విద్యుత్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అటువంటి విద్యుత్ ను పరిరక్షించుకునేందుకు, అందరికి విద్యుత్ ను అందించేందుకు రాష్ట్రముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో విద్యుత్ వెలుగులకు, అదే విధంగా ఉచిత విద్యత్ ను అందించడానికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. నేడు ఆధునిక విద్యుత్ సౌకర్యాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జె.సుభద్ర మాట్లాడుతూ ఆదాయంతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి విద్యుత్ సౌకర్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు.
ఈ పీ డీ సి ఎల్ డైరక్టర్ బి. రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ విద్యుత్ పొదుపు ద్వారా దేశ ఆర్ధిక వ్యవస్థను పటిష్ట పరుస్తు పర్యావరణానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాలకు ధీటూగా విద్యుత్ సౌకర్యాలను సమకూరుస్తున్నట్టు తెలిపారు. అనంతరం స్కూల్ ఆఫ్ ధియెటర్ ఆర్ట్స్ బాలలు జానపద నృత్యాలను, డేవిడ్ బృందం లఘనాటికలను ప్రదర్శించారు. నోడల్ ఆఫీసర్ మధు, వందన సమర్పణ చేశారు. ఈ కార్యాక్రమంలో ఈ పీడీసిఎల్ జోన్-3 డివిజినల్ ఎలక్టికల్ ఇంజనీర్ పోలంకి శ్రీనివాస రావు, స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ సి.ఈ.ఓ, చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా పరిషత్ సి.ఈ.ఓ., విజయ్ కుమార్, విద్యుత్ శాఖాదికారులు పాల్గోన్నారు.