ప్రజలకు జాప్యం లేకుండా ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందించాలని సచివాలయ సిబ్బందిని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. శుక్రవారం భీమవరంలో 10,18,20,21 వార్డు సచివాలయాలు ,ఏడ్వార్డ్ ట్యాంకు లను జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టరు మాట్లాడుతూ సచివాలయంలో సిబ్బంది హాజరు పట్టిక, సంక్షేమ పథకాల క్యాలెండర్, గడువులోగా ప్రజా సమస్యల పరిష్కారం నివేదిక తదితర వాటిని జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. వివిధ పధకాల అర్హుల జాబితాలను ప్రతినెల సచివాలయంలో ప్రదర్శించాలన్నారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలను అందించేందుకు సచివాలయ వ్యవస్థ ఎంతో కీలకమన్నారు. సచివాలయ ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వర్తించి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలందరికీ అవగాహన కల్పించాలన్నారు. ప్రతి పౌర సేవ నిర్దేశించిన కాలంలొనే ప్రజలకు సంతృప్తికరంగా ఉండేలా జిల్లా జాయింటు కలెక్టరు జె వి మురళి చూడాలన్నారు.ఏడ్వార్డ్ ట్యాంక్ సుందరీకరణకు ప్రతిపాదనలు రూపొందించామని మున్సిపల్ కమిషనర్ యస్ శివరామకృష్ణ జిల్లా జాయింట్ కలెక్టరుకు వివరించారు. జిల్లా జాయింటు కలెక్టరు వెంట మున్సిపల్ కమిషనరు యస్. శివరామకృష్ణ,తహశీల్దారు వై. రవికుమార్, కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, తదితరులు వున్నారు.