ఆగష్టు 1న అన్నవరంలో జిల్లా స్పందన
Ens Balu
7
Annavaram
2022-07-29 11:45:57
ఆగష్టు నెల మొదటి సోమవారం 1వ తేదీన జిల్లా స్ధాయి స్పందన ప్రజా విజ్ఞాపనల స్వీకరణ కార్యక్రమాన్ని అన్నవరంలోని గౌరీ కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటల నుండి నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా ఒక ప్రకటనలో తెలియజేసారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ విజ్ఞాపనలను అన్నవరంలో స్వీకరిస్తామని కాకినాడ జిల్లాకు చెందిన అర్జీదారులు అందరూ ఈ అంశాన్ని గమనించి ఆగష్టు 1వ తేదీన తమ అర్జీలను అన్నవరంలో నిర్వహించే స్పందన కార్యక్రమంలో సమర్పించాలని ఆమె కోరారు. అలాగే వివిధ శాఖల జిల్లా అధికారులు అందరూ ఆగష్టు 1వ తేదీ సోమవారం ఉదయం 9-30 గంటలకే అన్నవరంలో నిర్వహించే స్పందన గ్రివెన్స్ సెల్ కార్యక్రమానికి విధిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.