శంఖవరం మండలంలో చాలా ఏళ్ల తరువాత పెద్ద ఎత్తున అర్హులైన నిరుపేదలకు పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ ప్రభుత్వం పించన్లును మంజూరు చేసిందని ఎంపీపీ పర్వత రాజబాబు అన్నారు. మంగళవారం శంఖవరం మండల కేంద్రంలోన గ్రామ సచివాలయం 1లో నిర్వహించిన కొత్త పించను పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్వచంద్రప్రసాద్ సహకారంతో 101 పించన్లు మూడు సచివాలయాల పరిధిలో మంజూరు కావడం ఆనందించదగ్గ విషయమన్నారు. ఎంపీడీఓ జె.రాంబాబాబు మాట్లాడుతూ, ప్రభుత్వం గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు ఇంటి ముంగిటే సేవలన్నీ అందిస్తోందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏ ప్రభుత్వ పథకానికైనా అర్హత ఉంటే వాలంటీర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. సర్పంచ్ గన్నియ్యమ్మ, ఉపసర్పంచ్ చింతంనీడి కుమార్ లు మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, ఏ ఒక్క నిరుపేదకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కొత్తగా పించన్లు మంజూరు మంజూరు చేసిందన్నారు. అనంతరం లబ్దిదారులకు పించన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మూడు గ్రామసచివాలయాల కార్యదర్శిలు, శ్రీరామచంద్రమూర్తి, శంకరాచార్యులు, సత్యన్నారాయణ, జూనియర్ సహాయకులు రమణమూర్తి, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, సంక్షేమ సహాయకులు, వైఎస్సార్సీ నాయకులు లచ్చబాబు, పడాల భాష, సతీష్, వీరబ్బాయి, సచివాలయ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.