ఘనంగా పింగళి జయంతి వేడుకలు


Ens Balu
8
Sankhavaram
2022-08-02 08:20:58

భారత త్రివర్ణ పతాక రూపశిల్పి, తెలుగు నేల ముద్దుబిడ్డ పింగళి వెంకయ్య ఆశయ సాధనకై  ప్రతి ఒక్కరు పాటు పడుతూ దేశభక్తిని పెంపొందించుకోవాలని శంఖవరం ఎంపీపీ పర్వత రాజబాబు పేర్కొన్నారు. పేర్కొన్నారు. మంగళవారం శంఖవరం మండల కేంద్రంలోసి గ్రామసచివాలయం-1లో  పింగళి జయంతిని ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ పింగళి వెంకయ్య 1878 ఆగస్టు రెండున కృష్ణాజిల్లా బట్రా పెనుమర్రు గ్రామంలో జన్మించారని ,మూడు గంటల వ్యవధిలో జాతీయ పతాకాన్ని రూపొందించి మహాత్మా గాంధీకి అందజేశారని గుర్తుచేశారు. భారత జాతి గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు విస్తరించేలా జాతీయ పతాకాన్ని రూపొందించారని అన్నారు. ఎంపీడీఓ జె.రాంబాబు మాట్లాడుతూ, దేశానికి, జాతికి ఘన కీర్తి సుమపార్జించిన పింగళి వెంకయ్య ఆదర్శప్రాయులని అన్నారు. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పింగళి వెంకయ్య జయంతి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా ఘనంగా నిర్వహిస్తుందని ఇది మన తెలుగు జాతికి గర్వకారణమని  అన్నారు. ఈ కార్యక్రమంలో మూడు గ్రామసచివాలయాల కార్యదర్శిలు, శ్రీరామచంద్రమూర్తి, శంకరాచార్యులు, సత్యన్నారాయణ, జూనియర్ సహాయకులు రమణమూర్తి, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, సంక్షేమ సహాయకులు, వైఎస్సార్సీ నాయకులు లచ్చబాబు, పడాల భాష, సతీష్, వీరబ్బాయి, సచివాలయ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

సిఫార్సు