అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో యోకొహోమా టైర్ల కంపెనీ యూనిట్ ప్రారంభోత్సవానికి జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. మంగళవారం ఉదయం 11 గంటలకు ఆయన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా యూనిట్ నెలకొల్పిన ప్రాంతానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రులు పీడిక రాజన్న దొర, బూడి ముత్యాల నాయుడు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ప్రభుత్వ విప్ కరణం ధర్మ శ్రీ, అనకాపల్లి పార్లమెంటరీ సభ్యురాలు డా. బి. సత్యవతి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జె. సుభద్ర, ఎమ్మెల్యేలు యు.వి. రమణ మూర్తి రాజు, గొల్ల బాబూరావు, పి. ఉమా శంకర్ గణేష్, అదీప్ రాజ్, మున్సిపల్ చైర్ పర్సన్ పిల్లా రమాకుమారి, ఎమ్మెల్సీలు మాధవ్, జిల్లా కలెక్టర్ రవి పట్టాన్ శెట్టి, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, ఎస్పీ గౌతమి సాలి తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.