విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి మండలంలోని మెట్టుపల్లి గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి, మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె ముందుగా అటెండెన్సు రిజష్టర్లను, ఇతర రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామంలో ప్రజలకు సచివాలయం ద్వారా అన్ని సేవలు పూర్తిస్థాయిలో అందేలా చూడాలన్నారు. సచివాలయ పరిధిలో అమలు జరుగుతున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలపై వాకబు చేశారు. కోవిడ్ వేక్సినేషన్, పిల్లలు, బాలింతలు, గర్భిణులకు టీకా కార్యక్రమంపై ఆరా తీశారు. గృహనిర్మాణ ప్రగతిని పరిశీలించారు. ఓటిఎస్‌పై ప్రశ్నించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా జరుగుతున్న పోషకాహార పంపిణీ, పాల సరఫరాపై ప్రశ్నించారు. ఎఎన్ఎం, ఆశా వర్కర్లతో మాట్లాడారు. గ్రామానికి చెందిన గర్బిణిని రప్పించి, ఆమెతో మాట్లాడారు. ఆమెకు పోషకాహారం సక్రమంగా అందుతున్నదీ లేనిదీ, నెలవారీగా నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షలపై ఆరా తీశారు. గర్భిణులు, బాలింతలు అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చి భోజనం చేసేలా చూడాలన్నారు. వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రశ్నించారు. అర్హులందరికీ సంక్షేమ కార్యక్రమాలను అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో తాశీల్దార్ మామిడిపల్లి సురేష్ పాల్గొన్నారు.