గిరిజన గ్రామాల సమస్యలపై ప్రత్యేక దృష్టి


Ens Balu
12
Paderu
2022-08-16 15:03:51

మారుమూల గిరిజన గ్రామాలు సమస్యలను పరిష్కరించాలని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి అర్.గోపాలకృష్ణ ఆదేశించారు. మంగళవారం అన్ని శాఖల అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెదబయలు మండలం  కొండ్రుo, గిన్నెలకోట ఇంజరి, గ్రామ గిరిజనుల వ్యక్తి గత సమస్యలు, సామాజిక సమస్యలు పరిష్కరించాలని సూచించారు. అందరికీ జాబ్ కార్డులు, రైస్ కార్డులు మంజూరు చేయాలని ఆదేశించారు.84మందికి బ్యాంక్ ఖాతాలు లేవని అందరికీ బ్యాంక్ ఖాతాలు తెరవాలని చెప్పారు. గిన్నెలకోటలో 15రోజులు ఇంజరిలో 15రోజులు ఆధార్ కేంద్రం ఏర్పాటు చేసి ఆధార్ కార్డ్స్ మంజూరు చేయాలని చెప్పారు. 58కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేయాలని, హౌసింగ్ అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటికి మరుగు దొడ్లు మంజూరు చేయాలని డివిజనల్ పంచాయతీ అధికారికి సూచించారు. ఇంజరి కొండ్రుo గ్రామాల మధ్య కల్వర్టు నిర్మించాలని పి అర్ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అర్హులైన లబ్ధదారులకు అటవీ హక్కు పత్రాలు పంపిణీ చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఇంజరిలో పాటశాల నిర్మాణానికి రు . 5లక్షలు మంజూరు చేశామన్నారు. కొండ్రుo గ్రామానికి సామాజిక భవనం, పాటశాల మంజూరు చేశామన్నారు. అదేవిధంగా గ్రామీణ నీటిసరఫా విభాగం అధికారులతో సమీక్షించారు. మంజూరు చేసిన తాగు నీటి పనులను పూర్తి చేయాలని స్పష్టం చేసారు.జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి పై ఆరాతీశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలక్టర్ వి. అభిషేక్,పి.అర్. ఈ ఈ కె. లావణ్య కుమార్ 11మండలాల అధికారులు పాల్గొన్నారు.
సిఫార్సు