చెన్నైవాసి విద్వాన్ మధురై టి ఎన్ శేష గోపాలన్ కృష్ణ తన వాద్య సంగీత మధురిమల తో పలువురు వాగ్గేయకారుల కృతులను రమణీయంగా ఆలపించి శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేశారు. మంగళవారం సాయంత్రం విశాఖలోలని పిఠాపురం కాలనీ లోని కళాభారతి ఆడిటోరియంలో విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ (కళాభారతి) నిర్వహిస్తున్న వార్షికోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు జరిగిన కచేరీలో కృష్ణకు మృదంగం పై విశాఖ ఆకాశవాణి కళాకారులు ధన్వాడ ధర్మారావు, ఘ ఘటం పై సూర్య ప్రసాదరావు( శ్రీకాకుళం), వయోలిన్ పై మావుడూరి సత్యనారాయణ శర్మ( శ్రీకాకుళం) లయ వాద్య సహకారం అందించి కచేరిని రసవత్తరంగా నడిపించారు. ఈ కార్యక్రమానికి ఎం ఆర్ సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ కె రాంబాబు ముఖ్యఅతిథిగా, విజయ నిర్మాణ అధినేత డాక్టర్ విజయ్ కుమార్ గౌరవ అతిథిగా పాల్గొని కళాకారులను అభినందించారు. వి ఎం డి ఏ అధ్యక్షుడు ఎం సత్యనారాయణ రాజు, కార్యదర్శి జి ఆర్ కె ప్రసాద్( రాంబాబు), సుసర్ల రామ్ గోపాల్ తదితరులు కార్యక్రమాన్ని ఆసాంతం వీక్షించారు. రాంబాబు మాట్లాడుతూ 18 వరకు సాగే కార్యక్రమాలను ఉచితంగా వీక్షించేందుకు ప్రజలందరూ ఆహ్వానితులేనని, తాము తలపెట్టిన ఈ సంగీత వైభవాన్ని జయప్రదం చేయాలని కోరారు.