వర్కింగ్ జర్నలిస్టులకు పునశ్చరణ తరగతులు


Ens Balu
9
Visakhapatnam
2022-08-18 04:53:58

విశాఖ మహానగరం పరిధిలోని వర్కింగ్ జర్నలిస్టుల కోసం పునఃశ్చరణ తరగతులు నిర్వహి స్తున్నట్లు స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ తెలిపారు. ఈనెల 28వ తేదీన అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఈ శిక్షణా తరగతులను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రంగసాయి నాటక గ్రంథాలయంలో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీనియర్ జర్నలిస్టు ఎన్ నాగేశ్వరరావు (ఎన్. ఎన్. ఆర్) తో కలిసి అశోక్ కుమార్ మాట్లాడారు.  పాత్రికేయులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జర్నలిస్ట్ నాగేశ్వరావు మాట్లాడుతూ ఈ శిక్షణ తరగతుల్లో నాలుగు సెషన్స్ ఉంటాయని తెలిపారు. ఒక్కొక్క సెక్షన్ 45 నిమిషాలు చొప్పున మూడు గంటల పాటు శిక్షణ తరగతులు ఉంటాయని వివరించారు. ఇరువురు జర్నలిజం అధ్యాపకులు, ఇరువురు సీనియర్ జర్నలిస్టులు తరగతులు చెప్తారని ఆయన తెలిపారు. పునఃశ్చరణ  తరగతుల్లో పాల్గొనే జర్నలిస్టులకు సర్టిఫికెట్స్ అందజేయబడునని పేర్కొన్నారు..అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు  పద్మజా మాట్లాడుతూ ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొనే వారు ముందుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉత్సాహవంతులు తమ పేర్లను 73860 90368 నెంబర్ కు ఫోన్ చేసి ఈ నెల 26వ తేదీ లోపు నమోదు చేసుకోవాలన్నారు. జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న తరగతులను సద్వినియోగం చేసుకోవాలని రంగ సాయి నాటక గ్రంథాలయం వ్యవస్థాపకులు బాదంగీర్ సాయి విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఎస్.ఎన్. నాయుడు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎల్లజీరావు తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు