వరి సాగు చేస్తున్న ప్రతీ రైతు ఈ పంటలో తమ వివరాలు నమోదు చేసుకోవాలని వ్యవసాయ సహాయ సంచాలకులు ఎస్.బుల్లి బాబు రైతులకు సూచించారు. గురువారం శంఖవరం గ్రామంలో వ్యవసాయ సిబ్బంది చేస్తున్న ఈ పంట నమోదు ప్రక్రియను వ్యవసాయ అధికారి పి.గాంధీతో స్వయంగా పర్యవేక్షించి పలు సూచనలు ఇచ్చారు. వరి, పత్తి,ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులు,కౌలు రైతులు వారి ఆధారాలతో రైతు భరోసా కేంద్ర సిబ్బందితో ఈ పంట నమోదు చేసుకోవాలని కోరారు. పి.ఎం కిసాన్ వచ్చే విడత సొమ్ము కొరకు అర్హులైన రైతులందరూ ఈకేవైసీ చేయించుకోవాలని వివరించారు. ఈ కేవైసీ సంబంధించి సమాచారం తెలుసుకునేందు సచివాలయ పరిధిలోని రైతు భరోసా కేంద్రాల్లోని గ్రామీ వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ వ్యవసాయ సహాయకులు వికాస్,బిందు,రైతులు పాల్గొన్నారు.