రైతులు ఈకేవైసీ తప్పక చేయించుకోవాలి


Ens Balu
10
శంఖరం
2022-08-19 11:12:00

ప్రతీ రైతు ఈ పంటలో తమ వివరాలు నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎస్.బుల్లి బాబు రైతులకు సూచించారు.శుక్రవారం మండలంలోని కత్తి పూడి,ఆరెంపూడి,శంఖవరం ,రాజారం,మండపం, జి.కొత్తపల్లి గ్రామాల్లో వ్యవసాయ సిబ్బంది చేస్తున్న ఈ పంట నమోదు ప్రక్రియను వ్యవసాయ అధికారి పి గాంధీతో కలిసి క్షేత్రస్థాయిలో  పర్యవేక్షించి పలు సూచనలు ఇచ్చారు. వరి, పత్తి,ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులు,కౌలు రైతులు వారి ఆధారాలతో రైతు భరోసా కేంద్ర సిబ్బందితో ఈ పంట నమోదు చేసుకోవాలని కోరారు. జి. కొత్త పల్లిలో ప్రకృతి వ్యవసాయ పద్దతుల్లో సాగు చేస్తున్న మిశ్రమ పంటలు,గులి రాగి నారుమడిని పరిశీలించి రైతులకు సూచనలు ఇచ్చారు. పి.ఎం కిసాన్ వచ్చే విడత సొమ్ము కొరకు అర్హులైన రైతులందరూ ఈకేవైసీ చేయించుకోవాలని వివరించారు .సిబ్బంది ప్రభాస్, రజాక్,ప్రకృతి వ్యవసాయ సిబ్బంది,  రైతులు,మహిళలు పాల్గొన్నారు.
సిఫార్సు