వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేనేతలకు అన్నివిదాల న్యాయం చేస్తామని రాష్ట్ర సమాచార, బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ అన్నారు. శుక్రవారం రామచంద్రపురం నియోజకవర్గం, కాజులూరు మండలం, ఆర్యవటం గ్రామంలో "గడప గడపకు-మన ప్రభుత్వం" కార్యక్రమం మంత్రి పాల్గొన్నారు. ఆర్యవటం గ్రామంలో ఉన్న చేనేత కార్మికులను మంత్రి కలుసుకున్నారు. నేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం ద్వారా లబ్ది చేకూరుతుందా? అని ప్రతి నేతన్నను గడప గడపకు వెళ్లి తెలుసుకున్నారు. అంతే కాకుండా వివిధ ప్రభుత్వ పథకాలలో ఏయే పధకాల లబ్ది జరిగిందో ప్రజలకు వివరించారు. చేనేత కుటుంబాలను పరిశీలించిన మంత్రి వేణు స్వయంగా మగ్గాన్ని నేచారు. నేతన్నలకు ఈ ప్రభుత్వం బాసటగా ఉంటుందని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమాన్ని గడప గడపకు అందిస్తామని మంత్రి వేణు తెలియజేశారు.