అపరిశుభ్రతతో దోమల వ్యాప్తి చెందుతాయ్


Ens Balu
10
Kakinada
2022-08-20 07:59:49

దోమ చిన్నదే అయినా అది కుడితే మనిషి ప్రాణాలకే ప్రమాదం కాబట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని డాక్టర్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం కాకినాడలోని సర్పవరం జంక్షన్  బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ దోమల నివారణ దినోత్సవం పురస్కరించుకుని జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దోమ కాటు వలన మలేరియా ,డెంగ్యూ, ఫైలేరియా, మెదడువాపు, చికెన్ గున్యా వంటి వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉందన్నారు. మురికి నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో దోమలు త్వరగా వృద్ధి చెందుతాయి అని అన్నారు. దీనిని అధిగమించడం కోసం పరిసరాలలో చెత్త  వెయ్యరాదని అన్నారు. మలమూత్ర విసర్జన బయట చేయరాదని అన్నారు. మురికి నీరు నిల్వ ఉంచకుండా  చూడాలని, దోమతెరలను వినియోగించాలని అన్నారు. గంబూషియా  చేపలను బావులు, పెద్ద పెద్ద నీటి గుంటలలో పెంచడం వలన దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని డాక్టర్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రేలంగి బాపిరాజు, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు