సాంకేతిక రంగానికి ఆధ్యుడు రాజీవ్ గాంధీ


Ens Balu
7
Kakinada
2022-08-20 08:01:40

సైన్స్ ,టెక్నాలజీ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి మన దేశాన్ని ప్రగతి పదంలో నడిపించిన గొప్ప ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ అని ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. శనివారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ  జయంతి ఘనంగా జరిగింది .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1984 లో ఇందిరాగాంధీ మరణానంతరం దేశానికి ఆరవ ప్రధానిగా సేవలు అందించారని అన్నారు. ఆర్థిక సంస్కరణలకు  పునాది వేశారని అన్నారు. కంప్యూటర్లు, ఎయిర్ లైన్స్, రక్షణ రంగం, టెలి కమ్యూనికేషన్ లలో ఎంతో ప్రగతిని సాధించారని అన్నారు. ఆయన దేశానికి చేసిన కృషి, త్యాగాలను పునః స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని పట్నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్ ,రాఘవరావు, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు