భీమిలీలో SCRWA గుర్తింపు కార్డుల పంపిణీ


Ens Balu
6
Bheemili
2022-08-22 13:43:33

స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల సంక్షేమం, గుర్తింపు కోసం అహర్నిసలు క్రుషిచేస్తుందని అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ అన్నారు. సోమవారం భీమిలీలో నిర్వహించిన కార్యక్రమంలో యూనియన్ సరికొత్తగా రూపొందించిన నూతన గుర్తింపు కార్డులను సభ్యులకు అందజేసారు. ఈ సందర్బంగా అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ మాట్లాడుతూ, జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించే  ఎస్సిఆర్డబ్ల్యూఏ నిజమైన సభ్యులను గుర్తించడానికి రెండు బార్ కోడ్ లతో కూడిన ఐడీ కార్డులను తయారు చేయించిందన్నారు. సభ్యుల సంక్షేమమే ద్యేయంగా కొత్త ప్రణాళికలను రూపొందించి కార్యక్రమాలను సిద్ధం చేస్తున్నామన్నారు. ముఖ్యంగా  సభ్యులకు వృత్తి నైపుణ్యత పెంపొందించడానికి ఈ నెల 28న పునఃశ్చరణ తరగతులను  ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. ప్రతీ ఒక్క జర్నలిస్టు అసోసియేషన్ అందిస్తున్న పునఃశ్చరణ తరగతులను ఉపయోగించుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు.  అనంతరం అసోసియేషన్ కార్యక్రమాలు  దిగ్విజయంగా జరగడానికి  సహకరిస్తున్న సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసారు.  ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్  కార్యదర్శి కాళ్ళ సూర్యప్రకాష్ (కిరణ్),ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎల్లాజీరావు,భీమిలి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రమణ ప్రసాద్ , కార్యదర్శి కిషోర్, కోశాధికారి జి. శ్రీనివాసరావు, సభ్యులు మోహన్ రావు, కుమార్, శ్రీనివాస్, సూర్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు