గొలుగొండ మండలం నాగాపురం ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ మరిడమ్మ తల్లి జాతర మహోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆ గ్రామ సర్పంచ్ యలమంచిలి రఘురాం చంద్రరావు తెలిపారు. ఈ నెల 24, 25 తేదీల్లో వేడుకలను ఘనంగా చేపడతామన్నారు. 24న రాత్రి ప్రేమ్ కుమార్ ఆర్ట్స్ వారి డాన్స్, 25న అనంతపురం వారి బుర్ర కథ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. దానితోపాటు మరిన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలియజేశా. గ్రామంలోనూ, అమ్మవారి ఆలయం వద్ద విద్యుద్దీపాలంకరణ చేపట్టినట్టు వివరించారు. పండుగ ఆఖరి రోజు భారీ ఎత్తున మందుగుండు సామగ్రి కాల్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు. చుట్టు పక్కల గ్రామస్తులంతా తరలివచ్చి జాతర మహోత్సవాలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా సర్పంచ్ కోరారు.