సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి


Ens Balu
9
Palakollu
2022-08-24 08:41:08

 గ్రామ సచివాలయం ఉద్యోగులు, గ్రామ వాలంటీర్లు సమన్మయంతో పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయని జిల్లా కలెక్టర్  పి.ప్రశాంతి అన్నారు. బుధవారం కలెక్టర్ దగ్గులూరు గ్రామంలోని సచివాలయంను  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా  శాఖల వారీగా సచివాలయం ఉద్యోగులను వర్క్ ప్లాన్ అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లను పరిశీలించారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా పరిష్కరించే స్థాయిలో ఉండాలని ఏ చిన్న పిర్యాదు లేకుండా చక్కగా విధులు నిర్వర్తించాలని ఆమె అన్నారు. జగనన్న ప్రభుత్వ సంక్షేమ క్యాలెండరు తదితర సమాచారం ప్రజలకు తెలిసేలా ఖచ్చితంగా సచివాలయ బయట డిస్ ప్లే  చెయ్యాలని ఆమె అధికారులను ఆదేశించారు. వార్డు సచివాలయాలు సిబ్బంది చురుకుగా పనిచేయాలని ఏది అడిగినా చక్కగా సమాధానం చెప్పాలని ఆమె తెలిపారు. సచివాలయం బయట డిస్ ప్లే చేసిన సంక్షేమ పథకాలు, లబ్ధిదారుల జాబితాలని పరిశీలించి, అధికారులకు జిల్లా కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతి పలు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ .వెంకట రమణ, తహ శీల్దారు జి .మమ్మీ ,యంపిడివో  యస్. వెంకటేశ్వర రావు, ఇ వో పి ఆర్ డి  షరీఫ్ ,సచివాలయం సిబ్బంది, తది తరులు పాల్గొన్నారు.
సిఫార్సు