సాంకేతిక పరిజ్ఞానం మరింత పెంచుకోవాలి


Ens Balu
7
Madhurawada
2022-08-24 08:52:50

వర్కింగ్ జర్నలిస్టులు విషయ, సాంకేతిక పరిజ్ఞానం మరింత పెంపొందించుకోవాలని స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ అన్నారు. బుధవారం విశాఖలోని శిల్పారామం(జాతర) లో ఎస్.సి.ఆర్.డబ్ల్యూ.ఏ మధురవాడ యూనిట్ సభ్యులకు అసోసియేషన్ నూతన గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్బంగా అధ్యక్షులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించే  ఎస్సిఆర్డబ్ల్యూఏ నిజమైన సభ్యులను గుర్తించడానికి రెండు బార్ కోడ్ లతో కూడిన ఐడీ కార్డులను తయారు చేయించామన్నారు. సభ్యుల సంక్షేమమే ద్యేయంగా కొత్త ప్రణాళికలను రూపొందించి కార్యక్రమాలను సిద్ధం చేశామని చెప్పారు. ముఖ్యంగా  సభ్యులకు వృత్తి నైపుణ్యత పెంపొందించడానికి ఈ నెల 28న పునఃశ్చరణ తరగతులను  ఏర్పాట్లు చేస్తున్నామన్నారు..ప్రతీ ఒక్కరూ  పునఃశ్చరణ తరగతులను ఉపయోగించుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకోవలన్నారు. అసోసియేషన్ కార్యక్రమాలు  దిగ్విజయంగా జరగడానికి  సహకరిస్తున్న సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసారు.  ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్  కార్యదర్శి కాళ్ళ సూర్యప్రకాష్ (కిరణ్),ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎల్లాజీరావు,ముఖ్య సలహాదారులు కర్రి సత్యనారాయణ(సత్య),సహాయ కార్యదర్సులు అబ్బిరెడ్డి చంద్రశేఖర్, బాలుపాత్రో తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు