వీరఘట్టం మండలం తెట్టంగి గ్రామంలో 40 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ సచివాలయ భవనాన్ని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, శాసనసభ్యులు విశ్వాసరాయి కళావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎక్కడ అవినీతి కి అవకాశం లేకుండా నేరుగా ప్రజలకు అందేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. పాలనను ప్రజల ముంగిటకు తీసుకొచ్చిన సచివాలయం, వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ లు రాష్ట్రానికి మంచి పేరు తెచ్చి పెట్టాయని అన్నారు. శాసనసభ్యులు విశ్వాసరాయి కళావతి మాట్లాడుతూ గ్రామ సచివాలయాలు గ్రామాల అభివృద్ధికి సోపానాలు అని తెలిపారు. సచివాలయం ఏర్పాటు ద్వారా గ్రామం లోనే ప్రజలకు కావలసిన అన్నిసేవలు అందిస్తున్నారని, రైతులకు కూడా గ్రామం లోనే రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటుచేసి విత్తనం నుండి పంట కొనుగోలు వరకు సమస్త సేవలు అందజేస్తున్నారని తెలిపారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన ప్రతి మాటను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు.