ఈ-క్రాప్ నమోదు పక్కగా నిర్వహించాలి


Ens Balu
5
Pachipenta
2022-08-24 13:20:01

రైతు పండించిన పంటకు ఇ- క్రాప్ నమోదు పక్కగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం పాచిపెంట సమీపంలోని పత్తి పంట ఇ క్రాప్ నమోదు ప్రక్రియను పరిశీలించారు. రైతు పండించిన పంట, ఏ సమయంలో వేసింది , ఇ క్రాప్ నమోదు యాప్ లోని వివరాలను, గ్రామ వ్యవసాయ సహయకురాలు అశ్వినీ లావణ్యను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఇ క్రాప్ నమోదు ఎంతమేర జరిగిందని కలెక్టర్ ప్రశ్నించగా పాచిపెంట సచివాలయం పరిధిలోని 205 ఎకరాల వరకు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఎరువులు, యూరియా సక్రమంగా అందుతున్నది లేనిది, పంట చేతికి అందాక ఏ విధంగా మార్కెట్ చేస్తున్నదీ అనే విషయాలను రైతు గండి గుప్తేశ్వరరావును అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ రైతు భరోసా కేంద్రాల్లో సరఫరా చేసిన ఎరువులను, యూరియాను వినియోగించుకున్నట్లు రైతు చెప్పారు. అర్హత మేరకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వర్తించేందుకు ప్రతీ రైతు పంటను ఇ క్రాప్ లో నమోదు అయ్యేలా సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
సిఫార్సు