యోగ సాధన తో సంపూర్ణ ఆరోగ్యం


Ens Balu
8
Kakinada
2022-08-25 07:52:30

యోగ సాధనలో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ఇందుకు గాను కొన్ని నియమాలు పాటించాలని యోగా శిక్షకులు పి . పార్థసారథి పేర్కొన్నారు.  గురువారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. శబ్ద, వాయు కాలుష్యం లేని ప్రదేశంలో గాలి, వెలుతురు ఉన్నచోట యోగాసనాలు వేయాలన్నారు. మలమూత్ర విసర్జన అనంతరం ఖాళీ కడుపుతో ఎటువంటి ఒత్తిడి, కోపం, భయం లేకుండా యోగ సాధన చేయాలన్నారు. కాఫీ, టీ లు వంటివి తాగరాదని, బిగువైన దుస్తులు ధరించరాదని అన్నారు. నేల మీద యోగ సాధన చేయరాదని, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు వైద్యుల సూచనల మేరకు యోగ సాధన చేయాలన్నారు. చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు యోగాసనాలు వేయవచ్చని పార్థసారథి తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు