నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా వుంటుందని ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు అన్నారు. గురువారం కోటపాడు (మం) అర్లీ గ్రామానికి చెందిన బోలిం ఎర్రాపాత్రుడు అనారోగ్య సమస్యల నిమిత్తం ఆసుపత్రిలో అయినా ఖర్చుల నిమిత్తం 44 వేల రూపాయల చెక్ ను గురువారం అర్లి గ్రామంలో లబ్ధిదారుడికి అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ సహాయాన్ని ఎందరో అభాగ్యులకు అందిస్తోందన్నారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నవారికి ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ సహాయాన్ని అందిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.