నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకంలో భాగంగా ధరకాస్తు చేసుకున్న లబ్దిదారుల స్వంత ఇంటి కల సాకారం చేసే దిశగా అడుగులు వేయడం జరుగుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ పేర్కొన్నారు. శుక్రవారం రాజానగరం నియోజకవర్గం లో జాయింట్ కలెక్టర్ రాజానగరం, కోరుకొండ, రంగంపేట , సీతానగరం మండలాల్లో భూసేకరణ లో భాగంగా తహశీల్దార్లు తో కలిసి క్షేత్ర స్థాయి లో పర్యటించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ వివరాలు తెలుపుతూ, జిల్లాలో అర్హత ఉన్న ప్రతి ఒక్క పేదవాని ఇంటి కల సాకారం కోసం భూములను గుర్తించి, సేకరించడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగా నవరత్నాలు పేదలందరికీ ఇల్లు, 90 రోజుల కార్యక్రమంలో భాగంగా అనువైన స్థలాలను మండల స్థాయి లో గుర్తించడం జరిగిందని, వాటిని క్షేత్ర స్థాయి లో ప్రత్యక్షం గా పర్యవేక్షణ చేసినట్లు తెలిపారు. రాజానగరం నియోజకవర్గ పరిధిలో నాలుగు మండలాల్లో 1,024 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు అందించే క్రమంలో 25.71 ఎకరాలు పరిశీలన చేసినట్లు తెలిపారు. రాజానగరం లో శ్రీకృష్ణ పట్నం లో 16 మంది లబ్దిదారుల కోసం 93 సెంట్లు, కోరుకొండ మండలంలో నీడిగట్ల లో 60 మంది కోసం 87 సెంట్లు, గాదరాడ లో 440 మందికి 15. 26ఎకరాలు, కోటికేశవరంలో 136 మందికి 6.12 ఎకరాల్లో స్థలాలు ఇళ్ళ స్థలాల కోసం భూసేకరణ చేస్తున్నట్లు శ్రీధర్ తెలిపారు. అదేవిధంగా రంగంపేట లో వడిసలేరు గ్రామంలో 22 మంది లబ్ధిదారుల కోసం 63 సెంట్లు, సీతానగరం మండలం లో నాగులపల్లి 1.40 ఎకరాలు, వంగలపూడి గ్రామాల్లో 50 సెంట్లు, గతంలో సేకరించిన 7 ఎకరాలు తో కలిపి 350 మందికి ఇళ్ళ స్థలాల ఇచ్చేందుకు భూములను గుర్తించినట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ పర్యటన లో తహశీల్దార్లు పి. పాపరావు, ఎన్. పవన్ కుమార్, అహ్మద్ ఉన్నిసా , ఎస్.సత్యనారాయణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.