రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాలకు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. ఎచెర్లలోని బాలయోగి గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న 17 ఏళ్ళ విద్యార్థిని మృతిపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున శనివారం జిల్లా పర్యటనలో స్వయంగా వెళ్లి పరామర్శించారు. గురుకులంలోని విద్యార్థులతో ముచ్చటించిన ఎవ్వరూ అధైర్యపడొద్దని, ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదన్నారు. మీకు అండగా ప్రభుత్వం ఉంటుందని, విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి నాడు - నేడుతో పేను మార్పులు చేపట్టిందని వెల్లడించారు. మధ్యాహ్న భోజనం పథక నిర్వహణలో ప్రభుత్వం పెను మార్పులు చేసి మెనూ అందిస్తుందన్నారు. విద్యార్థులకు ఎటువంటి సమస్య వచ్చిన జిల్లా యంత్రంగా అందుబాటులో ఉంటుందని, విద్యార్థుల సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి శాసన సభలోనే మధ్యాహ్న భోజనానికి ఒక మెనూ తయారుచేసి అందులో చిక్కీలు కూడా చేర్చినట్లు వివరించారు.
ఈ నేపథ్యంలో ఎస్.సి.,ఎస్టీ, బిసి, మైనారిటీ వసతీ గృహాలు, రెసిడెన్షియల్ స్కూల్స్ ల్లో మంచి మెనూ, నాణ్యమైన భోజనం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు బహిరంగ మరుగుదొడ్లకు వెళ్లకుండా మరుగుదొడ్లు నిర్మించినట్లు తెలిపారు. ఏ ఒక్క విద్యార్థి అధైర్య పడకుండా, ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ఉండి బాగా చదువుకోవాలని హితవుపలికారు. ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ ఎం. విజయ సునీత, ఎచ్చెర్ల శాసన సభ్యులు గొర్ల కిరణ్ కుమార్, ఎ.పి.రెసిడెన్షియల్ సెక్రెటరీ పావనమూర్తి, రెవెన్యూ డివిజనల్ అధికారి బొడ్డేపల్లి శాంతి, ఎస్.సి. కార్పొరేషన్ ఇ డి రామారావు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు గడ్డెమ్మ, జిల్లా కో ఆర్డినేటర్ యశోద లక్ష్మి, బాలయోగి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పి. నిర్మల, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, జిల్లా దళిత సంఘాల జేఏసీ నాయకులు కంఠ వేణు, తైక్వాండో శ్రీను, యజ్జల గురుమూర్తి, లింగాల గరికివాడు, మిస్కా కృష్ణయ్య పెయ్యల చంటి, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.